ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- March 27, 2026
న్యూ ఢిల్లీ: శేరిలింగంపల్లికి చెందిన బంగారు బాబు, హోప్ ఫౌండేషన్, తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ను ఢిల్లీ ఇన్కమ్ టాక్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి బయలుదేరిన కొండ విజయ్ కుమార్ ను హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో గురువారం సాయంత్రం స్థానిక ఐటీ అధికారులు అడ్డుకొని పాన్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. తదనంతరం కొండ విజయ్ కుమార్ న్యూఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగగానే అక్కడి ఢిల్లీ ఇన్కమ్ టాక్స్ అధికారులు నలుగురు వారిని అదుపులోకి తీసుకొని ఎయిర్ పోర్టు లోనే విచారణ ప్రారంభించారు.
తన ఒంటి పైన ఉన్న బంగారం మొత్తాన్ని సీజ్ చేయడంతో పాటు వారి పేరుతో ఉన్న స్థిర, చర ఆస్తుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. 12 గంటల పాటు విచారించిన అధికారులు అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లడానికి అనుమతిని ఇచ్చారు. అనంతరం మళ్లీ వారిని విచారణకు హాజరు కావాల్సిందిగా సూచించినట్లు సమాచారం. అయితే సీజ్ చేసిన బంగారాన్ని తిరిగి ఇస్తారా, వారిని విడుదల చేస్తారా అనేది వారి ఇన్కమ్ టాక్స్ చెల్లింపుల పైన ఆధారపడి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







