ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- March 27, 2026
దోహా: GCC దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతుండటంతో అత్యున్నత స్థాయి భద్రతా హెచ్చరికలను జారీ చేశారు
సౌదీ అరేబియా తూర్పు ప్రావిన్స్‌లో తమ వాయు రక్షణ వ్యవస్థలు ఐదు డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విషయాన్ని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, మేజర్ జనరల్ తుర్కి అల్ మాలికి ధృవీకరించారు.
ఖతార్ జాతీయ అత్యవసర హెచ్చరిక
ఖతార్ అత్యవసర సేవల విభాగం అత్యున్నత స్థాయి భద్రతా హెచ్చరికను జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఫోన్లకు తీవ్రమైన శబ్దంతో కూడిన హెచ్చరిక సందేశాలను పంపింది. గత వారం రోజుల్లో ఇటువంటి హెచ్చరిక జారీ కావడం ఇదే మొదటిసారి. ప్రజలు ఇళ్ల లోపలే ఉండాలని, కిటికీలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే, కొన్ని నిమిషాల వ్యవధిలోనే, భద్రతా ముప్పు తొలగిపోయినట్లు మరో మెసేజ్ ను అన్ని ఫోన్లకు పంపినట్లు అధికారులు తెలిపారు.
కువైట్ లోని షువైఖ్ నౌకాశ్రయం పై డ్రోన్ల దాడి
కువైట్ నగరానికి సమీపంలో ఉన్న షువైఖ్ నౌకాశ్రయాన్ని ఈ ఉదయం డ్రోన్ దాడులు లక్ష్యంగా చేసుకున్నాయని కువైట్ నౌకాశ్రయ ప్రాధికార సంస్థ తెలిపింది. ఈ దాడి వల్ల భౌతికంగా నష్టాలు సంభవించాయని, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
బహ్రెయిన్‌లో మోగిన సైరన్లు
బహ్రెయిన్ లో హెచ్చరిక సైరన్లు మోగించినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. పౌరులు మరియు నివాసితులు ప్రశాంతంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అలాగే అధికారిక మాధ్యమాల ద్వారా వచ్చే తాజా సమాచారాన్ని ఫాలో కావాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్‌లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్









