ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- March 27, 2026
కువైట్: ఈరోజు తెల్లవారుజామున శత్రు డ్రోన్లు మరియు క్రూయిజ్ క్షిపణులు ముబారక్ అల్-కబీర్ పోర్టు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని ప్రజా పనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పరిస్థితిని అత్యవసర ప్రతిస్పందన టీమ్ అదుపులోకి తీసుకువచ్చాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ధృవీకరించింది. ఈ దాడి వల్ల పోర్టు మౌలిక సదుపాయాలకు భౌతిక నష్టం వాటిల్లిందని ప్రాథమిక నివేదికలు సూచించాయి. కానీ ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదని తెలిపింది.
షువైఖ్ పోర్టు పై అటాక్
షువైఖ్ పోర్టును శత్రు డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని, దీనివల్ల ఆస్తి నష్టం జరిగిందని, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కువైట్ పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది. ఈ మేరకు తన X లోని తమ అధికారిక ఖాతాలో ఒక ప్రకటనలో తెలిపింది.ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం మౌలిక సదుపాయాలకే పరిమితమైందని, ఎవరూ గాయపడలేదని అథారిటీ తెలిపింది. సాధ్యమైనంత వరకు సాధారణ పోర్టు కార్యకలాపాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







