ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- March 27, 2026
జెద్దా: ఏటా 50 నుండి 60 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందిస్తున్న విమానాశ్రయాలలో జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో నిలిచింది. స్కైట్రాక్స్ 2026 ర్యాంకింగ్ ప్రకారం, ప్రపంచంలో అత్యంత టాప్ విమానాశ్రయాలలో ఇది ఐదవ స్థానాన్ని కూడా దక్కించుకుంది. గత సంవత్సరం నుండి 17 స్థానాలు మెరుగుపడి, టాప్ 100 విమానాశ్రయాల జాబితాలో మొత్తంగా 27వ స్థానంలో నిలిచింది. సేవా నాణ్యత మరియు ప్రయాణీకుల అనుభవంలో విమానాశ్రయం వేగవంతమైన పురోగతిని సాధించింది. లండన్‌లో ఇటీవల జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్‌పోలో ఈ మేరకు ప్రకటించారు.
ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి, మరియు తన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడానికి జెద్దా ఎయిర్‌పోర్ట్స్ చేసిన కృషి నేపథ్యంలో ఈ రికార్డు దక్కిందని నివేదిక తెలిపింది. ఇక మెగా ఎయిర్‌పోర్ట్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా మూడవ ర్యాంకు సాధించింది.
ఈ రికార్డులు ప్రయాణీకుల అనుభవానికి సంబంధించిన పనితీరులో నిరంతర మెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా హజ్, ఉమ్రా యాత్రలకు వచ్చే యాత్రికులకు సేవలు అందించడంలో, రాజ్యంలోని ప్రధాన ప్రవేశ ద్వారాలలో ఒకటిగా ఈ విమానాశ్రయం స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని జెద్దా ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్









