మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ
- March 28, 2026
అమరావతి: అమరావతిలోని రాయవూడి సమీపంలో పైపులు దగ్ధమైన ఘటనకు కావలాదారుడే కారణం అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలంలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డు రాము నిప్పు పెట్టినట్లు తేల్చారు. ఇందుకు కారణాలేంటి? ప్రోత్స హించిన వారెవరైనా ఉన్నారా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. రాజధాని ప్రాంతంలో వరుసగా 3 అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. కోట్ల రూపాయల విలువైన పైపులు ధ్వంసం కావడం వల్ల ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
వరుస అగ్ని ప్రమాదాల వెనుక గల కారణాలు అన్వేషించి బాధ్యుల్ని గుర్తించడానికి పోలీసు యంత్రాంగం ప్రత్యేక దర్యాప్తు చేసింది. గుంటూరు అదనపు ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో 4 బృందాలు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలిలో సాక్షులను పోలీసులు విచారించారు. పక్కనే క్యాంపుల్లో ఉంటున్న కార్మికుల వివరాలు సేకరించారు. ఫోన్ కాల్స్ డేటా, అనుమానా స్పద వ్యక్తుల విచారణ ఘటనాస్థలిలో ప్రత్యేక పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? వంటి వాటి పై దృష్టి పెట్టారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందం ఇచ్చిన సమాచారాన్ని ఒక బృందం విశ్లేషించింది.
పైపులు దగ్ధమైన సమయంలో సెల్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా ఆ సమయంలో ఏ ఫోన్ కాల్స్ వెళ్లాయి? ఎంతమంది మాట్లాడు కున్నారు? ఎవరెవరితో సంభాషించారనే విషయాలపై ఆరా తీసి విశ్లేషించారు. అదే సమయంలో ఎవరెవరు ఆ ప్రాంతంలో సంచ రించారనే కోణంలో గాలించారు. కొంత సమా చారం సేకరించిన తర్వాతా సెక్యూరిటీ గార్డు రామును ఘటనాస్థలికి తీసుకెళ్లారు. ఆరోజు ఏం జరిగిందన్న అన్న విషయాన్ని అతడ్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. మంటలు ఏ సమయం లో ఎప్పుడు గుర్తించారు? ఏ ప్రాంతంలో గుర్తిం చారు? తొలుత ఎవరికీ సమాచారం ఇచ్చారు? మంటలు అదుపుచేయడానికి చేసిన ప్రయత్నా లేమిటి? ఎంత సమయంలో మంటలు విస్తరించాయి? వంటి అంశాలపై ప్రశ్నించారు.
పైపులకు కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డు రాము నుంచి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అతనిపై అనుమానం కలిగింది. అతడిని 2 రోజుల పాటు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి పలు వివరాలు రాబట్టారు. ఘటనాస్థలిలో ఆధారాలు, సాంకేతిక డేటా విశ్లేషణ, పలు మార్గాల్లో సేకరించిన సమాచారం మేరకు కాపలాదారే నిప్పు పెట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
సిట్ అధికారి రవికుమార్, తుళ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సిట్ బృందంతో భేటీ అయ్యి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అగ్ని ప్రమాద ఘటన దర్యాప్తు పై చర్చించారు. గురువారం ఘటనాస్థలికి సెక్యూరిటీ గార్డు రామును తీసుకెళ్లారు. ఈనెల 23 రాత్రి ఏం జరిగింది అన్న విషయాన్ని మరోసారి సీన్ రీకనస్ట్రక్షన్ చేసి కొన్ని విషయాలు నిర్ధారించు కున్నారు. కావలాదారుడే నిప్పు పెట్టడానికి కారణాలు ఏంటి? అందుకు ఎవరైనా ప్రోత్స హించారా? దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్‌లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ
- టీవీ వీక్షకుల రేటింగ్స్ పై కేంద్రం సరికొత్త నిబంధనలు
- మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ









