డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!

- March 29, 2026 , by Maagulf
డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!

మనామా: జాతీయ భద్రతను దృష్టి పెట్టుకొని డ్రోన్ల వాడకంపై పూర్తిగా నిషేధం విధించినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న భద్రతా పరిస్థితులు మరియు రాజ్యంపై ఇటీవల జరిగిన శత్రుపూరిత చర్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

నిషేధాన్ని ఉల్లంఘించిన ఏ డ్రోన్‌నైనా వెంటనే అడ్డుకుని, ధ్వంసం చేస్తామన్నారు. అలాగే నిషేధాన్ని ఉల్లంఘించినట్లు తేలిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అది హెచ్చరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రజల భద్రతను మరియు జాతీయ భద్రతను కాపాడటానికి ఈ చర్య అవసరమని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com