హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- March 31, 2026
దోహా: హ్యూమన్ ట్రాఫికింగ్ కు సంబంధించిన నేరాలను గుర్తించి, ఎదుర్కోవడంలో సహాయపడటానికి ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మేరకు హెచ్చరికల జాబితాలను తన సోషల్ మీడియా హ్యాండిల్ లో విడుదల చేసింది. "ఈ దారుణమైన నేరాలు జరగకముందే వాటిని నివారించడానికి, మానవ అక్రమ రవాణా సూచికలను గుర్తించడం చాలా ముఖ్యం." మంత్రిత్వశాఖ తెలిపింది. అనుమానిత మానవ అక్రమ రవాణా కేసులను నివేదించడానికి పౌరులు మరియు నివాసితులు 16044 హాట్‌లైన్‌కు కాల్ చేయాలని కొరింది.
మానవ అక్రమ రవాణాను సూచించే కొన్ని సైన్స్:
1. పాస్‌పోర్ట్‌లను, వ్యక్తిగత గుర్తింపు పత్రాలు స్వాధీనం చేసుకోవడం.
2. బలవంతం చేయడం లేదా బలవంతపు చాకిరీని విధించడం.
3. ఇతరులతో సంభాషించకుండా నిరోధించడం.
4. భయాన్ని కలిగించే బెదిరింపులు లేదా భయపెట్టడం.
5. అమానవీయమైన పని లేదా నివాస పరిస్థితులు.
మానవ అక్రమ రవాణాకు సంబంధించిన, నివేదించదగిన కొన్ని విషయాలు:
1. పని ప్రదేశంలో బలవంతపు దోపిడీ.
2. మోసపూరిత ఉద్యోగ ప్రకటనల ద్వారా నియామకాలు.
3. పత్రాలను నిలిపివేయడం లేదా స్వేచ్ఛగా తిరిగే హక్కుపై ఆంక్షలు.
4. కార్మికుల హక్కులు లేదా గౌరవానికి భంగం కలిగించే ఏవైనా పద్ధతులు.
మానుమానిత కేసులను నివేదించడం ద్వారా బాధితులను రక్షించడానికి మరియు మానవ అక్రమ రవాణా నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సంబంధిత అధికారులకు బలాన్ని చేకూరుస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







