ఒమన్ పై ద్రోణి ఎఫెక్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- March 31, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌పై ఒక వాయు ద్రోణి (air trough) ప్రభావం పడనుంది. దీని ప్రభావం నేటి సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఉంటుందని పౌర విమానయాన అథారిటీ (CAA)కి చెందిన వాతావరణ నిపుణుడు ఇబ్రహీం బిన్ అహ్మద్ అల్ బ్రాష్డి తెలిపారు. ముసందమ్, అల్ బురైమి, అల్ ధాహిరా, ఉత్తర అల్ బతినా, అల్ వుస్తా మరియు దక్షిణ అల్ బతినా గవర్నరేట్ల పై దీని ప్రభావం ఉంటుందన్నారు. దీని ఫలితంగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం, ముసందమ్, అల్ బురైమీ మరియు అల్ ధాహిరాలోని కొన్ని ప్రాంతాలు, అల్ బతీనా గవర్నరేట్‌లోని కొన్ని ప్రాంతాలలో వాతావరణం వేగంగా మారుతుందని, ఆకాశం మేఘావృతమై ఉందన్నారు. దీనివల్ల తేలికపాటి, చెదురుమదురు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.
అంతకుముందు, మార్చి 31న సాయంత్రం నుండి ప్రారంభమై ఏప్రిల్ 2 ఉదయం వరకు అల్పపీడన వ్యవస్థ వల్ల ఒమన్ లోని వాతావరణం ప్రభావితం అవుతుందని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలు మరియు చల్లని గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఆయా ప్రాంతాలలో వాడీలు మరియు లోయలలో ఆకస్మిక వరదలు సంభవించవచ్చని, అలాగే వర్షం సమయంలో విజిబిలిటీ కూడా తగ్గె అవకాశం ఉందన్నారు.
మార్చి 31:
ముసందమ్, అల్ బురైమీ, అల్ ధాహిరా, ఉత్తర అల్ బతీనా, అల్ వుస్తా, మరియు ధోఫార్ గవర్నరేట్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అప్పుడప్పుడు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక వాడీలలో పరిమిత ప్రవాహంతో తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం మరియు 10-20 నాట్ల వేగంగా తేలికపాటి నుండి మోస్తరు గాలులు వీస్తాయని ప్రకటించారు.
ఏప్రిల్ 1-2
ముసందమ్, అల్ బురైమీ, అల్ ధాహిరా, ఉత్తర మరియు దక్షిణ అల్ బతీనా, మస్కట్, అల్ దఖిలియా, ఉత్తర మరియు దక్షిణ అల్ షర్కియా, అల్ వుస్తా గవర్నరేట్‌లలో ఆకాశం మేఘావృతమై, అడ్వెక్షన్ కొనసాగుతుంది. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఉరుములతో కూడిన వర్షాలు కూడా పడతాయి.
హెచ్చరికలు:
లోయలు మరియు కొన్ని వాడీలలో ఆకస్మిక వరదలు. తాజా గాలులు (15-30 నాట్లు / 27-55 కి.మీ/గం).
సముద్ర పరిస్థితులు: ఒమన్ తీరప్రాంతాలలో చాలా వరకు మోస్తరు నుండి అలలు ఉంటాయి. గరిష్ట అలల ఎత్తు 2 నుండి 3 మీటర్లు. ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నప్పుడు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.
వర్షాలు, ఆకస్మిక వరదలు మరియు తక్కువ విజిబిలిటీ సమయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, బయలుదేరే ముందు సముద్రపు పరిస్థితులను తనిఖీ చేసుకోవాలి , పౌర విమానయాన అథారిటీ ప్రకటన జారీ చేసింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







