దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- March 31, 2026
కువైట్: కువైట్ ముడి ఆయిల్ సూపర్ ట్యాంకర్ “అల్-సల్మీ”పై మార్చి 31తెల్లవారుజామున ఇరాన్ దురుద్దేశపూర్వకంగా దాడి చేసిందని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) ప్రకటించింది. యూఏఈలోని దుబాయ్ పోర్టులో ఈ నౌక నిలిపిఉన్న సమయంలో తెల్లవారుజామున 12:10 గంటలకు ఈ సంఘటన జరిగిందని పేర్కొంది.
దాడి జరిగిన సమయంలో ట్యాంకర్ పూర్తిగా సరుకుతో నిండి ఉందని KPC తెలిపింది. ఈ దాడి కారణంగా షిప్ బయటి భాగానికి నష్టం వాటిల్లడంతో పాటు, షిప్ లోపల మంటలు చెలరేగాయని పేర్కొంది. దీంతో ఆయిల్ ట్యాంకర్ చుట్టుపక్కల జలాల్లో చమురు లీకేజీ అయ్యే ప్రమాదంపై ఆందోళనలు ఉన్నాయని తెలిపింది.
అత్యవసర సహాయక బృందాలు ప్రస్తుతం సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంటలను అదుపులోకి తెచ్చి, ఆర్పివేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొంది. ఈ దాడి ఫలితంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కార్పొరేషన్ వెల్లడించింది. ఆయిల్ ట్యాంకర్ ను కాపాడటానికి మరియు పర్యావరణ ప్రమాదాన్ని నివారించడానికి అవసరమైన చర్యలతో పాటు జరిగిన నష్టంపై విచారణ జరుగుతోందని తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







