కిడ్నాప్ కు గురైన భారతీయ బాలిక క్షేమంగా ఇంటికి చేరుకొంది.
- August 04, 2016
మనామా: హోరా లో గత మంగళవారం రాత్రి ఓ భారతీయ బాలికను అపహరణకు గురైన విషయం "మా గల్ఫ్ డాట్ కామ్" పాఠకులకు విదితమే . ఐదు ఏళ్ల సారా తీవ్ర ఉత్కంఠ తో కూడిన 24 గంటల తర్వాత కుటుంబంతో ఏకమయ్యారు. సారా తల్లి చల్లని స్టోర్ నుండి నీటిని కొనుగోలు చేసేందుకు కారు బయటకు వెళ్ళిన సమయంలో మంగళవారం రాత్రి ఆమె కుమార్తెని కారును దుండగులుఅపహరించారు.ఈ అపహరణలో ప్రధాన నిందితులైన ఒక పురుషుడు మరియు ఒక మహిళ కారు దొంగతనం చేయడంలోనే నిమగ్నమైనట్లు ఆ తర్వాత వారు ఆ కారులో కూర్చున్న బాలికని గుర్తించడం జరిగిందని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఆ నిందితుల ఇరువురి పేర్లు గుర్తింపులు బహిర్గతం కాకుండా వారిని అదుపులోనికి తీసుకొన్నట్లు పేర్కొంది.ఈ సందర్భంగా కాపిటల్ గవర్నరేట్ పోలీస్ జనరల్ డైరెక్టరేట్ కల్నల్ ఖలీద్ అల్ తవాది మాట్లాడుతూ కిడ్నాప్ చేసినవారు ఒక బహ్రేయినీ వ్యక్తి (38), మరియు ఒక ఆసియా మహిళ(37) గా తెలియచేసారు.ఈ బాలికని వేఠేకెందుకు 25 గస్తీ వాహనాల బృందం అన్వేషణ జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు గూర్చి తెలియడమే వారు దర్యాప్తుని వేగవంతంగా ప్రారంభించారు. కిడ్నాప్ చేసినవారిని గుర్తించారు. సారాతో వెళ్లిన కారులో ఉన్న ఓ మహిళా పాపని తీసుకువెళ్లి హోరా లో ఉన్న తన ఇంటిలో దాచినట్లు కనుగొనబడింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు ఈ కిడ్నాప్ సంఘటన గురించి తెలిపినట్లు మరియు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని "కల్నల్ అల్ తవాది పేర్కొన్నారు. పాప బాబాయి అనీష్ చార్లెస్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాప దొరికినట్లు ఆమె గూర్చి సంతోషకరమైన వార్తని పోలీసులు ధ్రువీకరించారు. వారు గత రాత్రి హోరా పోలీసు స్టేషన్ నుండి సారాని తీసుకొనివచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







