చెన్నై-పళని ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది..

- August 04, 2016 , by Maagulf
చెన్నై-పళని ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది..

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చెన్నై-పళని ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. జిల్లాలోని దసంపట్టి ప్రాంతంలో రాత్రి సమయంలో రైలు ఇంజను, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. సంఘటనలో ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ సంఘటన కారణంగా దాదాపు మూడు గంటలపాటు ఆ మార్గంలో రైళ్లను నిలిపేసి తర్వాత తిరిగి ప్రారంభించారు. ప్రయాణికులను మరో రైలులో గమ్యస్థానాలకు పంపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com