AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- April 01, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదన్న జగన్.. తాము ప్రతిపాదించిన ప్లాన్ బి (Plan B) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాలను కలిపి రాజధాని చేసి.. ‘మావిగన్’ అని పేరు పెట్టాలని సూచించారు. రాష్ట్రం కోసం ప్రాక్టికల్‌గా ఆలోచించే ఎవరికైనా తాము చెప్పేది అర్థమవుతుందన్నారు. ప్రాక్టికల్‌గా మేము చేసిన ఆలోచన మీకు నచ్చలేదని.. తాము ప్రతిపాదించిన ప్లాన్ బి గురించి కనీసం ఆలోచన చేయలేదన్నారు.
విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తే.. ఇప్పుడు అమరావతి కోసం అంచనా వేస్తున్న రెండు లక్షల కోట్లలో కేవలం 10 శాతం పెడితే.. భవిష్యత్తులో మంచి నగరం అవుతుందన్నారు. అక్కడ ఇప్పటికే 30-40 లక్షల మంది జనాభా ఉన్నారని..నగరం మరింత పెరుగుతుందని తెలిపారు. రాజధానిగా జనసంచారం లేని అమరావతి ప్రాంతం ఎందుకని జగన్ ప్రశ్నించారు. అన్ని సౌకర్యాలు ఉన్న ఈ మూడు నగరాలను కలిపి రాజధాని పెట్టాలని సూచించారు.
చంద్రబాబు గతంలోనే స్వార్థం లేకుండా ఆలోచన చేసి ఉంటే ఈపాటికి రాష్ట్రానికి రాజధాని ఉండేది. రాష్ట్రానికి ఇప్పుడు సత్వరమే గ్రోత్ ఇంజన్ లాంటి రాజధాని నగరం కావాలి. అది విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాలను కలిపి చేయబోయే నగరమే అవుతుందన్నారు. కొత్తగా ఏర్పడే నగరానికి ‘మావిగన్’ అని పేరు పెట్టాలని సూచించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







