బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- July 10, 2026
మనామా: బహ్రెయిన్‌లో వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల నిషేధానికి సంబంధించి తయారీదారులు, దిగుమతిదారులు, వ్యాపారులు తమ ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ సూచించింది. 2026 నాటి రిజల్యూషన్ నెం.7 ప్రకారం.. 57 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు తనిఖీలు, ప్రమాణాల డైరెక్టరేట్ డైరెక్టర్ సయ్యద్ అలీ షుబ్బర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నిబంధనలు అమల్లోకి రావడానికి ముందే ఉత్పత్తి విధానాల్లో మార్పులు చేయడం, నిబంధనలకు అనుగుణమైన ప్రత్యామ్నాయాలను సమకూర్చుకోవడం, ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్ సంచుల నిల్వలను విక్రయించడం వంటి చర్యలను పూర్తి చేయాలని సూచించారు.
కొత్త నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించేందుకు మార్గదర్శక పుస్తకాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే వ్యాపారుల సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తయారీదారులు, దిగుమతిదారులు, వ్యాపారులకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నిబంధనల రూపకల్పన, అమలు ప్రక్రియలో వాణిజ్య రంగాన్ని భాగస్వామ్యం చేసినట్లు షుబ్బర్ పేర్కొన్నారు. ముసాయిదా నిబంధనలను ముందుగా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కు తెలియజేసి, అనంతరం బహ్రెయిన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో పాటు ఇతర భాగస్వాములతో సమావేశాలు నిర్వహించి సాంకేతిక ప్రమాణాలపై వివరణ ఇచ్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







