ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- July 10, 2026
దోహా: ట్రాఫిక్ జరిమానాలను సకాలంలో చెల్లించాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) వాహనదారులకు సూచించింది. గడువులోగా జరిమానాలు చెల్లించడం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను పొందే అవకాశం ఉంటుందని పేర్కొంది. అలాగే, జరిమానాలు చెల్లించని కారణంగా ఎదురయ్యే చట్టపరమైన చర్యలను నివారించవచ్చని తెలిపింది. ఈమేరకు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
12 నెలలకు పైగా బకాయిగా ఉన్న ట్రాఫిక్ జరిమానాల కేసులను సంబంధిత ప్రాసిక్యూషన్ అధికారులకు బదిలీ చేస్తామని హెచ్చరించింది. అలాంటి కేసుల్లో రాజీ (Reconciliation) ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. అదే విధంగా, ట్రాఫిక్ ఉల్లంఘన నమోదు అయిన తేదీ నుంచి ఒక నెలలోపు జరిమానా చెల్లిస్తే ఎంపిక చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనలపై 50 శాతం రాయితీ వర్తిస్తుందని గుర్తు చేసింది.
జరిమానాలను ఆలస్యం చేయకుండా చెల్లించడం ద్వారా అదనపు శిక్షలు, చట్టపరమైన ఇబ్బందులను నివారించవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాహనదారులు తమ ట్రాఫిక్ జరిమానాలను తరచూ చేక్ చేసుకొని, నిర్దేశిత గడువులోగా చెల్లించాలని సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







