జీ మెయిల్‌కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్
- April 01, 2026
గూగుల్ తన వినియోగదారుల కోసం ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. దశాబ్దాలుగా ఉన్న ఒక ప్రధాన సమస్యకు పరిష్కారం చూపుతూ.. ఇప్పుడు వినియోగదారులు తమ పాత జీమెయిల్ యూజర్‌నేమ్‌లను మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. సాధారణంగా మనం చిన్నతనంలోనో లేదా సరదాకో పెట్టుకున్న వింతైన ఈమెయిల్ అడ్రస్‌లు, వయసు పెరిగే కొద్దీ వృత్తిపరమైన అవసరాలకు ఇబ్బందిగా మారుతుంటాయి. ఈ విషయాన్ని గుర్తించిన గూగుల్ (Google), గత ఏడాది కాలంగా కసరత్తు చేసి ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా అమెరికాలోని వినియోగదారులకు ఇది ఇప్పటికే అందుబాటులోకి రాగా, భవిష్యత్తులో అందరికీ వర్తించే అవకాశం ఉంది.
ఈ కీలక అప్‌డేట్ గురించి ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు. 2004లో జీమెయిల్ ప్రారంభమైనప్పుడు ఉన్న పరిస్థితులు వేరని, కానీ ఇప్పుడు మీ చిరునామా ఆ కాలానికే పరిమితం కావాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పాత కాలపు వింత పేర్లతో ఉన్న ఈమెయిల్ ఐడిలను వదిలించుకుని, కొత్తగా అందుబాటులో ఉన్న గౌరవప్రదమైన పేర్లను ఎంచుకోవాలని ఆయన సూచించారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. మీరు పేరు మార్చుకున్నప్పటికీ మీ పాత యూజర్‌నేమ్ అలాగే ఉంటుంది. మీరు పాత, కొత్త పేర్లు రెండింటినీ ఉపయోగించి మీ ఖాతాలోకి లాగిన్ అయ్యే వెసులుబాటును గూగుల్ కల్పిస్తోంది. సాంకేతికంగా ఈ మార్పు ఎలా పనిచేస్తుందనే అంశాన్ని పరిశీలిస్తే.. ఇది యూజర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు @gmail.com కు ముందు ఉండే భాగాన్ని మార్చుకున్నప్పటికీ, మీ ఖాతాలోని పాత మెయిల్‌లు, ఫోటోలు, డ్రైవ్ ఫైల్‌లు లేదా యూట్యూబ్ డేటా ఏమాత్రం ప్రభావితం కావు. అన్నీ మీ ఖాతాకే లింక్ అయి ఉంటాయి. మీ పాత ఈమెయిల్ అడ్రస్ ఆటోమేటిక్‌గా ప్రత్యామ్నాయ చిరునామాగా మారుతుంది. దీనివల్ల మీ పాత ఐడికి ఎవరైనా మెయిల్ పంపినా, అవి నేరుగా మీ కొత్త ఇన్‌బాక్స్‌కే వస్తాయి. అంటే మీరు ఎటువంటి ముఖ్యమైన సమాచారాన్ని కోల్పోయే ప్రమాదం ఉండదు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







