తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- April 01, 2026
తిరుపతి: P4 తొలి వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలను రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాలు, నియోజకవర్గ కేంద్రాల్లో లైవ్‌గా ప్రసారం చేయడం విశేషం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా ఎంపిక చేసిన దుబాయ్‌కు చెందిన NRI, ప్రముఖ ఆర్థిక సలహాదారు మహమ్మద్ ఆరిఫ్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆయన విజయగాథను సభలో ప్రదర్శించగా, అక్కడున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రశంసలు కురిపించారు.
కార్యక్రమంలో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వరులు, ప్రధాన కార్యదర్శి పీయూష్ కుమార్, పలువురు మంత్రులు, IAS, IPS అధికారులు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పుస్తకంలో మహమ్మద్ ఆరిఫ్ ఇంటర్వ్యూను ప్రచురించారు. వేలాది కేస్ స్టడీలలో ఆయన ద్వారా లబ్ధి పొందిన ఒక బెనిఫిషియరీ కథను ఎంపిక చేసి ప్రేరణాత్మక విజయగాథగా ప్రదర్శించారు.
అందరిలో ప్రత్యేకంగా ఆకట్టుకున్న కథ కడప నగరంలోని రామరాజుపల్లికి చెందిన షేక్ రజియాది. గత 25 ఏళ్లుగా విధవరాలిగా జీవిస్తూ, ₹10 లక్షల అప్పులతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె, ఇద్దరు కుమార్తెల వివాహాల తర్వాత కూడా కేవలం ₹5,000 ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు.
మహమ్మద్ ఆరిఫ్ మార్గదర్శకత్వంతో ఆమెకు కువైట్‌లో ఉపాధి అవకాశం కల్పించబడింది. ప్రస్తుతం ఆమె నెలకు ₹50,000 సంపాదిస్తూ, అప్పులను తీర్చుకుంటూ గౌరవ ప్రదమైన జీవితం వైపు ముందుకు సాగుతున్నారు.
కార్యక్రమంలో భాగంగా షేక్ రజియాను వీడియో కాల్ ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడేలా ఏర్పాటు చేశారు. ఆమె పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, ఆమె భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌కు ఆదేశించారు.
అదేవిధంగా, ఆమె కల అయిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను ప్రారంభించేందుకు మైక్రో ఎంటర్‌ప్రైజ్ రూపంలో ప్రభుత్వ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
మహమ్మద్ ఆరిఫ్ P4 కార్యక్రమం ద్వారా నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని, మొత్తం 251 కుటుంబాలకు ప్రత్యక్ష సహాయం అందించారు. వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆర్థిక సాయం అందించడం వంటి పలు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారు.
ఇక వైద్య సేవల పరంగా కూడా ఆయన సేవలు విశేషంగా నిలిచాయి. ఫాతిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (FIMS) సహకారంతో నాలుగు మెడికల్ క్యాంపులు నిర్వహించగా, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో మరో 8–9 వైద్య శిబిరాలు నిర్వహించి అనేక మందికి వైద్య సేవలు అందించారు.
P4 భవిష్యత్ లక్ష్యాలు, విస్తరణ ప్రణాళికలు, సమాజానికి మరింత సేవలు అందించే మార్గాలపై మహమ్మద్ ఆరిఫ్ ముఖ్యమంత్రితో తన ఆలోచనలను పంచుకున్నారు.
ఆయన సేవలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, సమాజ మార్పులో ఆయన కృషి ఆదర్శప్రాయమని కొనియాడి సత్కరించారు.
ఈ సందర్భంగా మహమ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ, “సరైన సమయంలో సరైన సహాయం అందితే జీవితాల్లో గొప్ప మార్పు సాధ్యమవుతుంది. P4 వంటి వేదికలు సమాజంలో అనేక మందికి కొత్త ఆశలు కల్పిస్తున్నాయి” అని అన్నారు.


తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







