కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- April 01, 2026
ఏప్రిల్ 13 నుంచి కువైట్–దమ్మామ్ మార్గంలో వారానికి మూడు సార్లు సేవలు
కువైట్ సిటీ: కువైట్కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ జజీరా ఎయిర్వేస్ భారతీయ ప్రయాణికుల కోసం మరిన్ని కొత్త విమాన సర్వీసులను ప్రకటించింది.ఏప్రిల్ 13 నుంచి విజయవాడ మరియు లక్నో నగరాలకు కొత్త సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
సంస్థ సీఈఓ బద్రన్ బస్యూతి వెల్లడించిన వివరాల ప్రకారం, సౌదీ అరేబియాలోని దమ్మామ్ మీదుగా కువైట్ నుంచి విజయవాడ, లక్నోలకు నేరుగా కనెక్టివిటీ కల్పించనున్నారు. ఈ రెండు గమ్యస్థానాలకు వారానికి మూడు సార్లు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.
ప్రయాణికులకు ఊరటనిచ్చే నిర్ణయం
ఈ కొత్త సర్వీసులు వందే భారత్ ఇనిషియేటివ్ కింద విమాన సేవలను విస్తరించడం, ముఖ్యంగా కువైట్లోని భారతీయ సమాజానికి మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా ప్రారంభిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు విజయవాడ సర్వీసు ప్రారంభం కావడం పెద్ద ఊరటనివ్వనుంది. గల్ఫ్ దేశాల నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారికి ఈ కొత్త కనెక్టివిటీ ద్వారా సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణం మరింత సులభం కానుంది అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
జజీరా ఎయిర్వేస్ తీసుకున్న ఈ నిర్ణయం కువైట్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు, ఉత్తర భారత ప్రయాణికులకు కూడా ఎంతో ఉపయోగకరంగా మారనుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







