దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- April 03, 2026
దుబాయ్: దుబాయ్ హిందూ దేవాలయం భద్రతా కారణాల దృష్ట్యా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.దుబాయ్ అధికారుల సూచనల మేరకు, తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ మూసివేత కొనసాగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
అధికారిక సూచనల మేరకు, భద్రతా కారణాల దృష్ట్యా గురుద్వారా గురు నానక్ దర్బార్ దుబాయ్ కూడా మూసివేయబడుతుందని ప్రకటించింది. ఈ దర్బార్ తదుపరి ప్రకటన వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
అలాగే, ఎమిరేట్‌లోని పలు చర్చిలు కూడా తదుపరి ప్రకటన వచ్చే వరకు ప్రార్థనా కార్యక్రమాలు మరియు ప్రత్యేక ఆరాధనలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.
మార్చి 9న జాతీయ భద్రతా సలహాలకు అనుగుణంగా BAPS హిందూ మందిర్ సైతం మూసివేతను ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు సందర్శకులకు దేవాలయం మూసివేయబడి ఉంటుందని తెలిపింది. అయితే, ప్రపంచ శాంతి మరియు రక్షణ కోసం ఆలయ పూజారులు తమ ప్రార్థనలను కొనసాగిస్తారని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







