ఫేక్ గూడ్స్‌ని సీజ్ చేసిన దుబాయ్ కస్టమ్స్
- August 04, 2016
2016 తొలి అర్థ భాగంలో దుబాయ్ కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్స్ 95 సీజ్‌లను నమోదు చేశారు. అలా సీజ్ చేయబడిన ఫేక్ ప్రోడక్ట్స్ విలువ 38.4 మిలియన్ దిర్హామ్‌లుగా ప్రకటించారు అధికారులు. వాచ్‌లు, సన్‌గ్లాస్‌లు, ఎలక్ట్రానిక్, ఆటో స్పేర్ పార్ట్స్, టెక్స్‌టైల్స్, బ్యాగ్స్, ఫుట్‌వేర్ వంటివి సీజ్ చేయబడిన వాటిలో ఉన్నాయి. ఆరోగ్యపరమైన, పర్యావరణ పరమైన సమస్యల నుంచి ప్రజల్ని కాపాడేందుకు దుబాయ్ కస్టమ్స్ కట్టుబడి ఉందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలోకి అక్రమ మార్గాల్లో ఫేక్ ఐటమ్స్ రానీయబోమని దుబాయ్ కస్టమ్స్ - పాలసీస్ అండ్ లెజిస్లేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సయీద్ అల్ తాయెర్ చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలతోనే కాకుండా ప్రైవేటు వ్యవస్థలతో కూడా కలిసి దుబాయ్ కస్టమ్స్ ఇంకా సమర్థవతంగా వ్యవహరిస్తుందని ఆయన వివరించారు. ఇంకో వైపున దుబాయ్ కస్టమ్స్ పలు సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటోంది. 2016 అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి నిర్వహణ పరంగా పార్టనర్స్‌గా వ్యవహరించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







