కార్మికులకోసం సౌదీ చర్యలు: వీకే సింగ్
- August 04, 2016
సౌదీ అరేబియా ప్రభుత్వం, సీరియస్‌గా చర్యలను ప్రారంభించినట్లు ఎక్సటర్నల్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వీకె సింగ్ చెప్పారు. సౌదీ అరేబియాలో ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, అర్ధాంతరంగా ఉద్యోగులను బయటకు పంపడంతో, పెద్ద సంఖ్యలో భారతీయ కార్మికులు రోడ్డున పడ్డ ఘటన ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం స్పందించింది. భారత ప్రభుత్వం సూచనతో, సౌదీ అరేబియా ప్రభుత్వం అక్కడి భారతీయ కార్మికుల్ని ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. భారతీయ కార్మికుల సమస్యలపై సౌదీ ప్రభుత్వంతో మాట్లాడినట్లు వీకే సింగ్ చెప్పారు. కంపెనీ నుంచి గెంటివేయబడ్డ కార్మికులు షెల్టర్ పొందుతున్న ప్రాంతాల్లో వారికి తగిన ఆహారం, ఇతరత్రా సౌకర్యాల్ని కల్పించాల్సిందిగా తాము చేసిన విజ్ఞప్తిని సౌదీ అరేబియా సానుకూలంగా పరిశీలించిందనీ, అలాగే వీలైనంత సహాయం భారతదేశం తరఫున బాధితులకు అందజేస్తున్నామని వికెసింగ్ చెప్పారు. సదరు కంపెనీ, సౌదీ చట్టాల్ని ఉల్లంఘించినట్లు సౌదీ అంబాసిడర్ టు ఇండియా సౌద్ బిన్ మొహ్మద్ అలా సాటి చెప్పారు. మొత్తం 10 క్యాంపుల్లో 4,072 మంది కార్మికులు ప్రస్తుతం ఉన్నారు. వీరంతా సౌదీ ఒగెర్ కంపెనీ నుంచి తొలగించబడ్డారు. వీరే కాకుండా మరో 2,153 మంది సౌదీ ఒగెర్ కంపెనీ కారణంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. సౌదీ అరేబియాలో మొత్తం 3 మిలియన్ మంది భారతీయ వలస కార్మికులు ఉంటారు. వీళ్ళలో ఎక్కువమంది బ్లూ కాలర్ కార్మికులే.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







