ఇకె521 విమాన ప్రమాదంలో ఫైర్ ఫైటర్ మృతి
- August 04, 2016
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్ అయిన ఘటనలో ఓ ఫైర్ ఫైటర్ మృతి చెందినట్లు జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. ఈ ప్రమాదంలో చాలామందిని కాపాడే క్రమంలో ఫైర్ ఫైటర్ మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందనీ, అతని ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నామని జిసిఎఎ డైరెక్టర్ జనరల్ సైఫ్ అల్ సువ్వాది చెప్పారు. మృతుడి పేరు జసిమ్ అల్ బెలౌషిగా వెల్లడించారు. రస్ అల్ ఖైమాకి చెందిన వ్యక్తి ఈయన. అల్ బెలౌషి సన్నిహితుడు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో స్పందిస్తూ, మనమంతా దేవుడికి చెందినవారం.. అల్ బెలౌషి మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక అని పేర్కొన్నారు. బెలౌషి మృతి పట్ల దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రగాడ సానుభూతి తెలిపారు. బెలౌషి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







