సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్‌లో ‘NATS’ సేవలు
- April 06, 2026
సెయింట్ లూయిస్: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ పేదలకు ఆహారం అందించే ఫుడ్‌బ్యాంక్ లో సేవలు అందించింది. మిస్సోరి చాప్టర్ ఆధ్వర్యంలో బ్రిడ్జ్టన్ లోని సెయింట్ లూయిస్ ఏరియా ఫుడ్ బ్యాంక్‌లో నాట్స్ సభ్యులు ఈ సేవలు అందించారు. నాట్స్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. సుమారు 30 మంది వాలంటీర్లు ఏకధాటిగా రెండు గంటల పాటు శ్రమించి, మొత్తం 5,766 పౌండ్ల (సుమారు 2.88 టన్నుల) ఆహార పదార్థాలను వర్గీకరించి, ప్యాకింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, నాట్స్ మిస్సోరి చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర, జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాల సహా మధుసూధన్ దద్దాల, నరేష్ రాయంకుల తదితర ముఖ్య సభ్యులు కీలకపాత్ర పోషించారు. నాట్స్ వాలంటీర్లు ఇందులో ఎంతో ఉత్సాహంగా తమ విలువైన సేవలు అందించారు. తక్కువ సమయంలోనే ఇంత భారీ మొత్తంలో ఆహారాన్ని నిరుపేదలకు పంపిణీ చేసేందుకు వీలుగా సిద్ధం చేయడం పట్ల ఫుడ్ బ్యాంక్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నాట్స్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలతో స్థానిక ప్రజలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా నాట్స్ మిస్సోరీ చాప్టర్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఫుడ్ బ్యాంక్‌లో సేవలు అందించిన నాట్స్ సభ్యులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేకంగా అభినందించారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







