సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- April 07, 2026
కువైట్: కువైట్ కు చెందిన 'అల్ థికా గ్రూప్' సామాజిక మరియు మానవీయ బాధ్యత పట్ల తన నిబద్ధతను చాటుకున్నది. ఇటీవల ఇరాన్ డ్రోన్ దాడిలో మరణించిన ఎలక్ట్రీషియన్ సంతానశెల్వం కృష్ణన్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. భారత్ లోని అతడి కుటుంబానికి ఏడాది పాటు వేతనాన్ని చెల్లించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
కువైట్లోని ఒక విద్యుత్ మరియు నీటి శుద్ధి కర్మాగారంలో (desalination plant) పనిచేస్తున్న సమయంలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో కృష్ణన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్లిష్ట సమయంలో మృతుడి కుటుంబానికి అండగా నిలిచే లక్ష్యంతో చేపట్టిన ఈ సహాయ కార్యక్రమాన్ని అమలు చేయడానికి, సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులన్నింటినీ పొందినట్లు కంపెనీ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







