ఇరాన్ 10 షరతులు ఇవే..
- April 08, 2026
టెహ్రాన్: ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న వార్‌కు తాత్కాలిక విరామం లభించింది. ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాలపాటు కాల్పుల విరమణ ప్రకటించారు. దీంతో ప్రపంచం మొత్తం కాస్త ఊపిరి పీల్చుకుంది.
హర్ముజ్ జలసంధి పై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో అమెరికా అధ్యక్షుడు తాత్కాలికంగా రెండు వారాలపాటు వార్ నిలిపివేస్తున్నామని, శాంతి చర్చలు జరుపుతామని ప్రకటించారు. అయితే, ఇదే సమయంలో ఇరాన్ 10 సూత్రాల ఫార్ములాను అమెరికా ముందు ఉంచింది.
ఇరాన్ పంపిన 10 సూత్రాల ఫార్ములా సానుకూలంగానే ఉందని ట్రంప్ ప్రకటించారు. శాంతి చర్చలు జరుపుతామని తెలిపారు. పశ్చిమాసియాలో ప్రశాంతతను నెలకొల్పడానికి ఈ రెండు వారాల గడువు ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ 10 సూత్రాలు ఇవే..
1. ఇరాన్, ఇరాక్, లెబనాన్, యెమెన్ వంటి అన్ని దేశాల పై తక్షణమే, శాశ్వతంగా దాడులను నిలిపివేయాలి.
2. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని తక్షణమే వాణిజ్య నౌకల కోసం తెరవడం. అయితే, ఇరాన్ సైన్యం నియంత్రణలో అది ఉండాలనే షరతు.
3. జలసంధి గుండా వెళ్లే నౌకల భద్రత, స్వేచ్ఛా రవాణా కోసం ఇరాన్ సైనిక పర్యవేక్షణతో ఒక కొత్త ప్రొటోకాల్ ను ఏర్పాటు చేయాలి.
4. జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌకపై సుమారు 2మిలియన్ డాలర్లు రుసుమును విధించాలి. ఈ ఆదాయాన్ని ఒమన్ తో పంచుకోవడమే కాకుండా, యుద్ధంతో దెబ్బతిన్న ఇరాన్ మౌలిక సదుపాయాల పున:నిర్మాణానికి ఉపయోగించాలి.
5. ఇరాన్ తన పౌర అవసరాల కోసం జరుపుతున్న యురేనియం సుసంపన్నత హక్కును అమెరికా, ఇతర దేశాలు గుర్తించాలి.
6. ఇరాన్ పై ఉన్న ప్రాథమిక, ద్వితీయ ఆర్థిక ఆంక్షలన్నీ పూర్తిగా తొలగించాలి.
7. అమెరికా, ఇరత దేశాల్లో ఉన్న ఇరాన్ నిధులను, ఆస్తులను తక్షణమే విడుదల చేయాలి.
8. యుద్ధం కారణంగా జరిగిన విధ్వంసానికిగాను ఇరాన్ కు పూర్తి స్థాయిలో పున:నిర్మాణ ఖర్చులు లేదా నష్టం పరిహారం చెల్లించాలి.
9. పశ్చిమాసియాలోని ప్రాంతీయ స్థావరాల నుండి అమెరికా తన పోరాట దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి.
10 . ఈ పది సూత్రాలతో కూడిన ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించాలి. తద్వారా ఇది అంతర్జాతీయ చట్టం ప్రకారం పక్కాగా అమలు కావాలి.
తాజా వార్తలు
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్‌న్యూస్
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్‌లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్‌లో అల్ అమెరికాత్ ఓవర్‌పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే







