తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- April 08, 2026
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్‌పోర్టుకు రాబోయే మూడు నెలల్లో శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఆదిలాబాద్‌లో పౌర మరియు సైనిక అవసరాలకు ఉపయోగపడేలా పెద్ద ఎయిర్‌పోర్టు నిర్మించాలని కేంద్రం యోచిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాల భూమి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు కేటాయిస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధమని చెప్పారు.
అదేవిధంగా కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో కూడా ఎయిర్‌పోర్టుల నిర్మాణ ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై వచ్చిన నివేదిక సానుకూలంగా ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









