కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- April 09, 2026
న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్ కోసం న్యూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీగా రూ.41,533.81 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు ఎరువులు తక్కువ ధరలకు అందించడమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశమని కేంద్రం తెలిపింది.
క్యాబినెట్ సమావేశంలో జైపూర్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కూడా ఆమోదం లభించింది. రూ.13,038 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ప్రహ్లాద్పుర నుంచి తోడి-మోడ్ వరకు 41 కిలోమీటర్ల పొడవైన కారిడార్‌గా మెట్రో మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు.
రాజస్థాన్‌లో హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు రూ.79,459 కోట్లు కేటాయించారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. వీటిలో 1720 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, 1200 మెగావాట్ల కళాయి-2 హైడ్రో ప్రాజెక్టు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







