కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

- April 09, 2026 , by Maagulf
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్ కోసం న్యూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీగా రూ.41,533.81 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు ఎరువులు తక్కువ ధరలకు అందించడమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశమని కేంద్రం తెలిపింది.

క్యాబినెట్ సమావేశంలో జైపూర్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కూడా ఆమోదం లభించింది. రూ.13,038 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ప్రహ్లాద్‌పుర నుంచి తోడి-మోడ్ వరకు 41 కిలోమీటర్ల పొడవైన కారిడార్‌గా మెట్రో మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు.

రాజస్థాన్‌లో హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు రూ.79,459 కోట్లు కేటాయించారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. వీటిలో 1720 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, 1200 మెగావాట్ల కళాయి-2 హైడ్రో ప్రాజెక్టు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com