ఆవాసయోగ్య పరిస్థితులున్న 20 గ్రహాలను కనుగొన్న శాస్త్రవేత్తలు

- August 04, 2016 , by Maagulf
ఆవాసయోగ్య పరిస్థితులున్న 20 గ్రహాలను కనుగొన్న శాస్త్రవేత్తలు

భూమిని పోలిన, ఆవాసయోగ్య పరిస్థితులున్న 20 గ్రహాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌర కుటుంబానికి వెలుపల అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన కెప్లర్‌ వ్యోమనౌక కనుగొన్న దాదాపు 4వేల గ్రహాల్లో ఇవి ఉన్నాయి. పరిశోధన బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త రవి కుమార్‌ కొప్పారపు కూడా పాలుపంచుకున్నారు.
తాజా పరిశోధనలో భాగంగా నక్షత్రాల చుట్టూ ఉన్న ఆవాసయోగ్య ప్రాంతంలో 216 గ్రహాలపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. ఈ ప్రాంతంలో సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. ఫలితంగా అక్కడ ద్రవ రూపంలో నీరు మనగడ సాగించడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద 20 గ్రహాలు శిలామయంగా ఉండి, ఆవాసయోగ్యంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇవి భూమి తరహాలో ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వివరించారు. పుడమి లాంటి గ్రహాలు ఈ విశ్వంలో ఎంత విస్తృతంగా ఉన్నాయి? జీవం ఉనికి ఎంత సాధారణమన్న కీలక ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి ఈ పరిశోధన ఉపయోగపడతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com