ఐఎస్ వాళ్లమంటూ భారతీయ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి
- August 04, 2016
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదివంటూ అమెరికాలో భారతీయ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. ఒమాహా పట్టణంలోని భారతీయ రెస్టారెంట్లో సుతాహర్ సుబ్బురాజ్ అనే వంటమనిషి పనిచేస్తున్నారు. చెత్త బయటపడేస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి సుబ్బురాజ్పై దాడి చేశాడు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దేశ విడిచివెళ్లిపోవాలంటూ అభ్యంతరకమైన మాటలతో తిట్టాడు. తల, ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ.. కాలితో తన్నాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. ఈ దాడిని హిందూ అమెరికా సంస్థలు తీవ్రంగా ఖండించాయి. దీన్ని జాతి వ్యతిరేక దాడిగా అభివర్ణించింది. దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల ప్రజలపై అనవసర భయాందోళనలు పెంచుకొని దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







