ఆవాసయోగ్య పరిస్థితులున్న 20 గ్రహాలను కనుగొన్న శాస్త్రవేత్తలు
- August 04, 2016
భూమిని పోలిన, ఆవాసయోగ్య పరిస్థితులున్న 20 గ్రహాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌర కుటుంబానికి వెలుపల అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన కెప్లర్ వ్యోమనౌక కనుగొన్న దాదాపు 4వేల గ్రహాల్లో ఇవి ఉన్నాయి. పరిశోధన బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త రవి కుమార్ కొప్పారపు కూడా పాలుపంచుకున్నారు.
తాజా పరిశోధనలో భాగంగా నక్షత్రాల చుట్టూ ఉన్న ఆవాసయోగ్య ప్రాంతంలో 216 గ్రహాలపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. ఈ ప్రాంతంలో సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. ఫలితంగా అక్కడ ద్రవ రూపంలో నీరు మనగడ సాగించడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద 20 గ్రహాలు శిలామయంగా ఉండి, ఆవాసయోగ్యంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇవి భూమి తరహాలో ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వివరించారు. పుడమి లాంటి గ్రహాలు ఈ విశ్వంలో ఎంత విస్తృతంగా ఉన్నాయి? జీవం ఉనికి ఎంత సాధారణమన్న కీలక ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి ఈ పరిశోధన ఉపయోగపడతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







