ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- April 09, 2026
మనామా: బహ్రెయిన్ పౌర విమానయాన వ్యవహారాల శాఖ అనుమతిని అనుసరించి, బహ్రెయిన్ జాతీయ విమానయాన సంస్థ అయిన గల్ఫ్ ఎయిర్.. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పరిమిత విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గల్ఫ్ ఎయిర్ షెడ్యూల్డ్ వాణిజ్య నెట్వర్క్్ను పూర్తిగా పునరుద్ధరించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.
గల్ఫ్ ఎయిర్.. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దుబాయ్ (DXB), జెడ్డా (JED), రియాద్ (RUH), లండన్ హీత్రో (LHR), నైరోబి (NBO), ఢాకా (DAC), (BOM), 5 (COK), ໕໖ (DEL), హైదరాబాద్ (HYD), ఇస్లామాబాద్ (ISB), లాహోర్ (LHE), మరియు తిరువనంతపురం (TRV) లకు ఫ్లైట్స్ నడుపనుంది. దీనికి సమాంతరంగ దమ్మమ్ కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు, అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రస్తుత సేవలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని .గల్ఫ్ ఎయిర్ గ్రూప్ ఛైర్మన్ ఖాలిద్ తఖీ పేర్కొన్నారు.
గల్ఫ్ ఎయిర్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, సంబంధిత అధికారులందరితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటుందని తెలిపారు. మారుతున్న గగనతల పరిస్థితులకు అనుగుణంగా, అవసరమైన విధంగా కార్యకలాపాల షెడ్యూళ్లను సర్దుబాటు చేయడం జరుగుతుందని ప్రయాణీకులు మరియు సిబ్బంది భద్రత, క్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యతగా ఉంటుందని తెలిపారు.
ఇక విమానాశ్రయానికి ప్రయాణించే ముందు, ప్రయాణికులు గల్ఫ్ ఎయిర్ అధికారిక వెబ్సైట్ gulfair.com లేదా గల్ఫ్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా తాజా విమాన స్టేటస్ ను తనిఖీ చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రయాణికుల కాంటాక్ట్ నంబర్లకు నేరుగా తెలియజేయబడుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే







