బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- April 10, 2026
మనామా: బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్ కు పాల్పడిన కంపెనీపై సెకండ్ లోయర్ క్రిమినల్ కోర్టు సీరియస్ అయింది. సంస్థను ఆరు నెలలపాటు మూసివేయడంతోపాటు BD5,000 జరిమానా చెల్లించాలని తీర్పును వెలువరించింది. అలాగే, సదరు ఫుడ్ కంపెనీ ఓనర్ కు మూడు సంవత్సరాల జైలు శిక్ష, BD 10,000 ఫైన్ వేసింది. శిక్షాకాలం పూర్తయ్యాక అతడిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించి మరో ఐదుగురు నిందితులకు మూడు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షలు విధించగా, వారిలో ఇద్దరిని శిక్షాకాలం పూర్తయ్యాక దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
గడువు ముగిసిన ఆహార పదార్థాలపై నకిలీ తేదీలతో కొత్త లేబుళ్లు వేసి, వాటిని తిరిగి అమ్మకానికి పెట్టడం ద్వారా ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించినందుకు ఆ కంపెనీని కోర్టు దోషిగా నిర్ధారించింది.
స్పెషల్ ఆపరేషన్
అధికారులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి పాడైపోయిన మరియు నకిలీ సరుకులన్నింటినీ, అలాగే ఉపయోగించిన మెషినరిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, అధికారులు స్వాధీనం చేసుకున్న ఫుడ్ ప్రొడక్టులను నిపుణుల సమక్షంలో ధ్వంసం చేయాలని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. అదేవిధంగా నిందితులు తమ సొంత ఖర్చుతో వాటిగురించి మీడియాలో ప్రచురించాలని కోర్టు ఆదేశించింది.
అంతకుముందు, పోలీసులు పక్కా సమాచాం మేరకు ఒక నివాసం మరియు వాణిజ్య సముదాయంపై దాడి చేశారు. అక్కడ గడువు ముగిసిన మరియు నకిలీ లేబుళ్లతో రీ ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఉల్లంఘనలు వినియోగదారుల భద్రతకు ప్రమాదకరమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







