దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!

- April 11, 2026 , by Maagulf
దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!

దోహాః మిడిలీస్టు వార్ ఎఫెక్ట్  తో ప్రపంచ ఇంధన పరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఖతార్ ఇంధన వ్యవహారాల సహాయ మంత్రి సాద్ అల్-కాబీ, భారత పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శుక్రవారం దోహాలో సమావేశమై, చర్చలు జరిపారు. భారత్‌తో ఇంధన సంబంధాలను బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నట్లు అల్-కాబీ తెలిపారు. అలాగే, అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణను ఇరు దేశాల మంత్రులు స్వాగతించారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరపున భారత మంత్రి, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి, అలాగే ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థానీకి విడిగా సందేశాలను అందజేశారు.  
మార్చి 2న రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలోఖతార్ ఎనర్జీ ద్రవీకృత సహజ వాయువు (LNG) ఉత్పత్తిని నిలిపివేసింది. మార్చి 4న, ఖతార్ ఎనర్జీ ప్రభావితమైన తన కొనుగోలుదారులకు ఫోర్స్ మేజర్ ప్రకటించింది. భారత్ కు LNG మరియు LPGలను సరఫరా చేసే అతిపెద్ద ఏకైక దేశం ఖతార్. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. భారతదేశం తన LNG సరఫరాలలో 45 శాతం, LPG సరఫరాలలో 20 శాతం కోసం ఖతార్‌పై ఆధారపడుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com