ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్‌లైన్ లో అనుమతులు..!!
- April 11, 2026
మస్కట్: ధోఫర్ మున్సిపాలిటీ సంస్కరణలకు శ్రీకారం చుట్టుంది. సేవల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ప్రక్రియలను వేగవంతానికి ప్రకటనల అనుమతుల జారీ, పునరుద్ధరణ ప్రక్రియలను తన ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌కు మార్చనుంది. డిజిటల్ ప్రక్రియలను బలోపేతం చేయడానికి, సేవల పంపిణీని ఆధునీకరించడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు మున్సిపాలిటీ తెలిపింది. ప్రకటనల అనుమతులకు సంబంధించిన అన్ని దరఖాస్తులు మున్సిపాలిటీ ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ చేయబడతాయని తెలిపింది. వాణిజ్య వాహనాలు, దుకాణాల ముందు ఉండే డిస్‌ప్లే యూనిట్ల వంటి వాహనాలపై ఉంచిన ప్రకటనలు, అలాగే వాణిజ్య ప్రాంగణాల వెలుపల పైకప్పులు, గోడలు మరియు పందిళ్లతో సహా భవనాలపై ఏర్పాటు చేసిన ప్రకటనలు ఉంటాయి.
ఈ ఆన్‌లైన్ సేవ, డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు, ప్రచురణలు మరియు ముద్రిత సామగ్రికి సంబంధించిన ప్రచార ప్రకటనలతో పాటు ఫుడ్ మెనూలు, సైన్ బోర్డులు మరియు పోస్టర్ల వంటి సేవా సంబంధిత ప్రకటనలను కూడా కవర్ చేస్తుందన్నారు. వ్యాపారాలు మరియు ప్రకటనదారులకు సేవలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడం ఈ డిజిటల్ సంస్కరణల ఉద్దేశ్యమని ధోఫర్ మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక
- కువైట్‌లో ఉగ్ర కుట్ర భగ్నం.. కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్న పౌరుడి అరెస్ట్
- అబుదాబి షాపింగ్ సెంటర్లో లులు గ్రూప్ ఉద్యోగులతో UAE అధ్యక్షుడి భేటీ
- సౌదీ అరేబియాలో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన విపుల్
- డా.ఈష్ సింఘాల్‌కు ఘన వీడ్కోలు.. కతార్‌లో భారతీయ సమాజానికి విశేష సేవలకు ప్రశంసలు
- కర్ణాటకలో గుట్కా, పాన్ మసాలా పై నిషేధం
- షార్జాలో మట్టితో నంబర్ ప్లేట్ దాచిన డ్రైవర్ అరెస్ట్..!!
- సౌదీలో భారీగా ఖాట్, హషీష్ స్వాధీనం.. 8 మంది అరెస్ట్..!!
- సలాలాలో ఫుడ్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- కొవ్వొత్తి మంటతో రూమ్మేట్ మృతి.. మహిళకు ఏడాది జైలు..!!







