వరుణ్ తేజ, సాయి పల్లవి కాంబినేషన్ లో..
- August 04, 2016
శేఖర కమ్ముల, వరుణ్ తేజ, సాయి పల్లవి కాంబినేషన్ లో రూపొందనున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈ రోజు(ఆగస్టు 5)నుంచి ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. నిజమాబాద్ వద్ద బన్సవాడ అనే చిన్న టౌన్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి టైటిల్ ని ఫైనల్ చేసారు. ఆ టైటిల్ ఏమిటంటే...'ఫిదా'. ఈ ఫొటోని దిల్ రాజు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో విడుదల చేసారు.అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓ ఎన్నారై అబ్బాయికి, తెలంగాణా టౌన్ నుంచి వచ్చిన ఓ కుర్రాడికి మధ్య జరిగే ఓ లవ్ స్టోరి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ధీమ్ పోస్టర్ ఈ రోజు విడుదల చేసారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తక్కువ కాలం లో, విన్నూత్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తనదైన ఐడెంటిటీ సంపాదించుకున్నారు. అటు యూత్ ను ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చక్కటి కథా బలం ఉన్న చిత్రాలను తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల.ఇప్పుడు వీరిద్దరి తో, ఉత్తమ కథా చిత్రాల నిర్మాత గా పేరు ఉన్న దిల్ రాజు త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించబోవటంతో అంచనాలు బాగా పెగుతున్నాయి.అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రేమమ్ చిత్రంతో పాపులర్ అయిన సాయి పల్లవిని ఎంపిక చేయటంతో మళయాళంలోనూ ఈ సినిమాకు బిజినెస్ చేయనున్నట్లు అర్దమవుతోంది. ఈ సందర్బంగా సాయి పల్లవి లేటెస్ట్ ఫొటోలను మీకు అందిస్తున్నాం.
స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు ఫొటోలతో...మాలర్ పాత్రలో ప్రేమం చిత్రం ద్వారా యువత ను బాగా ఆకట్టుకున్న సాయి పల్లవి ఈ చిత్రం లో హీరోయిన్ గా ఎంపిక చేయబడ్డారు.
ఒక అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం.
"శేఖర్ కమ్ముల ఒక వండర్ఫుల్ స్టొరీ టెల్లర్. వరుణ్ తేజ్ ఇప్పటికే మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెరికా లో ఉండే ఒక అబ్బాయి కి , తెలంగాణా లో పెరిగిన ఒక అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథ ఈ చిత్రం", అని తెలిపారు.
ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభమై ...ఆగస్టు చివరికి తెలంగాణా షెడ్యూల్ మొత్తం పూర్తి చేసుకుంటాం.అక్టోబర్ లో అమెరికా లో షూటింగ్ జరుపుతారు. ఈ షెడ్యూల్ లో తో షూటింగ్ పూర్తి అవుతుంది.చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపిందిఈ చిత్రానికి ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫి విజయ్ కుమార్ అందిస్తారు. ఇతర తారాగణం, మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనేవిడుదల చేస్తాం అని చిత్ర బృందం తెలిపింది.ఈ సినిమాలో సాయి పల్లవి క్యారక్టర్ హైలెట్ అని చెప్తున్నారు.తొలినుంచి శేఖర్ కమ్ముల స్త్రీ పాత్రలకు తన సినిమాలో హైలెట్ చేస్తూ వస్తున్నారు.శేఖర్ కమ్ముల తొలి చిత్రం ఆనంద్ లోనూ కమిలినీ ముఖర్జీ చుట్టూనే సినిమా తిరుగుతుందివరుణ్ తేజ సినిమాలోనూ హీరోయిన్ పాత్రకు అద్బంతగా తీర్చిదిద్దాడని తెలుస్తోంది.సాయి పల్లవి తన సినిమాల ఎంపిక విషయంలో చాలా సెలక్టివ్ గా వెళ్తోందిశేఖర్ కమ్ముల గత చిత్రాలు చూసే ఆమె ఈ చిత్రం ఓకే చేసిందని తెలుస్తోంది.ఈ చిత్రం కూడా తనకు పేరు తెచ్చిపెట్టిన ప్రేమమ్ లాంటి లవ్ స్టోరీ అని చెప్తోంది.సాయి పల్లవిని ఎక్కడికి వెళ్లినా మలార్ మిస్ అని పిలుస్తున్నారట మళయాళి ఆడియన్స్.సాయి పల్లవి వయస్సు ఇప్పుడు 25 ఏళ్లు మాత్రమే, మే 9, 1992లో జన్మించిందిప్రేమమ్ లో ఆమె పాత్రకు జీవితానికి సరపడ పేరు వచ్చిందంటోందిసాయి పల్లవి నిజ జీవిత ఫ్రొఫెషన్ దృష్యా ఓ డాక్టర్ఆమె తన డాక్టర్ కోర్స్ ని జార్జియాలో పూర్తి చేసింది.సాయి పల్లవి బ్రిలియంట్ డాన్సర్. ఆమె స్టెప్స్ మీరు ప్రేమమ్ లో చూడవచ్చు.
తొలి సినిమా చేయకముందు ఆమె చాలా రియాల్టి షోలలో పాల్గొందిప్రేమమ్ చిత్రం కు ముందు ఆమె జయం రవి హీరోగా వచ్చిన ధూమ్ ధామ్ చిత్రంలో ఓ చిన్న పాత్ర చేసింది
మొదట తన లుక్స్ మళయాళి సినిమాకు సెట్ అవ్వవని ప్రేమమ్ కు నో చెప్పిందిట
కానీ దర్సకుడు పాత్ర తమిళ టీచర్ అని చెప్పి కన్వీన్స్ చేసి ఒప్పించాడు
ప్రేమమ్ చిత్రం తర్వాత సాయి పల్లవి దుల్హర్ సరసన కాళి చిత్రం చేసింది.
మణిరత్నం తాజా చిత్రానికి తొలి ప్రాధాన్యత ఆమే. అయితే ఆ తర్వాత బాలీవుడ్ నటి అదితిరావు సీన్ లోకి వచ్చింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









