బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- July 20, 2026
మనామా: 2026 తొలి ఐదు నెలల్లో బహ్రెయిన్ జాతీయ ఉత్పత్తుల ఎగుమతుల మొత్తం విలువ BD1.384 బిలియన్ కు చేరుకుంది. అయితే ప్రాంతీయ రవాణా అంతరాయాలు, గల్ఫ్ సముద్ర మార్గాల్లో సమస్యలు, బహ్రెయిన్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడం వంటి పరిణామాల ప్రభావంతో మార్చి నుంచి ఎగుమతులు గణనీయంగా తగ్గినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.
జనవరి, ఫిబ్రవరి నెలల్లో నెలసరి సగటు ఎగుమతులు BD331.1 మిలియన్లు ఉండగా, మార్చి నుంచి మే వరకు అవి 27.3 శాతం తగ్గి BD240.7 మిలియన్లకు పడిపోయాయి. మార్చిలో ఎగుమతులు BD250.3 మిలియన్లుగా నమోదవగా, ఎయిర్ స్పేస్ తిరిగి తెరుచుకోవడంతో ఏప్రిల్‌లో BD265 మిలియన్లకు పెరిగాయి. అయితే మేలో మళ్లీ BD206.8 మిలియన్లకు పడిపోవడంతో, జనవరితో పోలిస్తే 38.4 శాతం తగ్గుదల నమోదైంది.
మార్చి నెలలో బహ్రెయిన్ చేరుకున్న ఎగుమతి గమ్యస్థానాల సంఖ్య 98 నుంచి 51కు తగ్గింది. అలాగే ఎగుమతి ఉత్పత్తుల విభాగాలు 676 నుంచి 477కు, ఎగుమతి ఒప్పందాలు 1,629 నుంచి 1,007కు పడిపోయాయి.
భారత్, అమెరికాకు ఎగుమతుల్లో భారీ తగ్గుదల
భారత్‌కు బహ్రెయిన్ ఎగుమతులు 65.8 శాతం తగ్గగా, అమెరికాకు ఎగుమతులు దాదాపు సగానికి పడిపోయాయి. యూరప్, ఆసియాలోని పలు దేశాలకు సరుకుల రవాణా కూడా 80 శాతానికి పైగా తగ్గినట్లు నివేదిక తెలిపింది.
ఇతర మార్కెట్లలో తగ్గుదలను గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలు కొంత మేర భర్తీ చేశాయి. ఫిబ్రవరిలో BD157 మిలియన్లు ఉన్న GCC దేశాలకు ఎగుమతులు మార్చిలో BD173.4 మిలియన్లకు పెరిగాయి. దీంతో మొత్తం ఎగుమతుల్లో GCC వాటా 48.1 శాతం నుంచి 69.3 శాతానికి పెరిగింది.
బహ్రెయిన్ ఎగుమతుల్లో అల్యూమినియం కీలక స్థానాన్ని కొనసాగించింది. మొత్తం ఎగుమతుల్లో దీని వాటా 47.8 శాతం నుంచి 61.8 శాతం మధ్య నమోదైంది. అయితే ప్రాసెస్ చేయని అల్యూమినియం మిశ్రమాల (Unwrought Aluminium Alloy) ఎగుమతులు ఫిబ్రవరిలో BD98 మిలియన్లు ఉండగా, మార్చిలో BD42 మిలియన్లకు తగ్గాయి.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







