సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- April 11, 2026
హైదరాబాద్: ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ (సత్యవతి), ఆమె సోదరుడు శివ, చిక్కుల్లో పడ్డారు. వీరిద్దరితో పాటు మరికొందరిపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భారీ స్థాయిలో నిధులు వసూలు చేసి మోసం చేయడమే కాకుండా, బాధితులను బెదిరించినట్లు వీరిపై అభియోగాలు ఉన్నాయి.న్యాయవాది సుబ్బారావు అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన ఆరోపణలు ఇవే!
దాదాపు 100 మంది అమాయక బాధితుల నుంచి అధిక లాభాల ఆశచూపి రూ.కోట్లు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. వ్యాపార పెట్టుబడుల పేరుతో ఈ సొమ్ము సేకరించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఏళ్లు గడుస్తున్నా లాభాలు రాకపోవడమే కాకుండా, కనీసం అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. కాగాబాధితుల తరపున న్యాయవాది సుబ్బారావు ఈ నిధులను వెనక్కి ఇవ్వాలని నిలదీయగా, మంగ్లీ టీమ్ నుంచి ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి.
అయితే, మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఊడుగుల తనకు ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించారని, తనను రోడ్డు ప్రమాదంలో చంపేస్తామని భయపెట్టారని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పంజాగుట్ట పోలీసులు BNS సెక్షన్ 351 (2), 352 కింద కేసు నమోదు చేశారు. మంగ్లీకి ఉన్న క్రేజ్ రీత్యా ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లో దర్శకుడు వేణు ఊడుగుల ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా నిధులు వసూలు చేశారా..లేక ఈ వ్యవహారం వెనుక ఇతర శక్తులు ఉన్నాయా? అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్‌ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









