గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- April 11, 2026
ముంబై: భారతీయ సంగీత శిఖరం, లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఆశా భోస్లే (92) అనారోగ్యానికి గురయ్యారు. శనివారం ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.ఈ విషయాన్ని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి డాక్టర్ ప్రతీత్ సందానీ ఒక ప్రకటనలో ధ్రువీకరించారు.
భారత సినీ సంగీత ప్రపంచంలో ఆశా భోంస్లే ఒక శిఖరం లాంటివారు. 1943లో మరాఠీ చిత్రం ‘మాఝా బల్’తో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె, 1948లో హిందీ చిత్రం ‘చునరియా’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో హిందీతో పాటు 20కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో దాదాపు 12,000కు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు. ఆర్.డి. బర్మన్, ఇళయరాజా, ఏ.ఆర్. రెహమాన్ వంటి ఎందరో ప్రముఖ సంగీత దర్శకులతో ఆమె పనిచేశారు.
ఆమె సంగీత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000లో అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. వీటితో పాటు ఆమె అనేక ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. గాయనిగానే కాకుండా 2013లో ‘మాయ్’ అనే మరాఠీ చిత్రంలో నటిగా కూడా కనిపించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాకు చేరుకున్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడి భేటీ
- హైదరాబాద్‌లో ఘనంగా 32వ ISOI జాతీయ సదస్సు
- రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడికి ఒప్పందం: సీఎం రేవంత్
- దమ్మామ్ విమానాశ్రయంలో భారీ గా డ్రగ్స్ సీజ్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!
- ఇరాన్ వాదనలను ఖండించిన ఖతార్.. యూఎన్ఓకు లేఖలు..!!
- రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!
- ఒమన్‌లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!
- 2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!







