నార్సింగి పోలీస్ స్టేషన్‌లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- April 11, 2026
హైదరాబాద్: ప్రముఖ సినీ గాయని మంగ్లీ మరియు న్యాయవాది సుభా సింగబోష్ మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ల వరకు చేరింది. ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఈ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.అయితే, ఆమె తాజాగా నార్సింగి పోలీస్ స్టేషన్ ను, ఆశ్రయించడం సంచలనంగా మారింది.
రూ.150 కోట్లకు మోసం చేశారంటూ తనపై సుభా సింగబోష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగ్లీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చి 21న సుభా సియపోగు పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి తనను బెదిరించాడని, అమర్యాదగా బెదిరించే ధోరణిలో మాట్లాడారని ఆమె వెల్లడించారు. తనను కలవాలని ఒత్తిడి చేశారని, నిరాకరిస్తే అప్రతిష్ఠ పాలు చేస్తానని బెదిరించారని ఆరోపించారు.
తనకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్ల వీడియో చూపించి బెదిరించారని, మరో వ్యక్తితో కలిసి అవమానకరంగా మాట్లాడారని చెప్పారు. సుభా సింగబోష్ తీరుపై తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు మంగ్లీ. దీంతో సుభా సింగబోష్‌పై కేసు నమోదు చేశారని తెలుస్తోంది.
దాదాపు 100 మంది అమాయక బాధితుల నుంచి అధిక లాభాల ఆశచూపి రూ.కోట్లు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. వ్యాపార పెట్టుబడుల పేరుతో ఈ సొమ్ము సేకరించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఏళ్లు గడుస్తున్నా లాభాలు రాకపోవడమే కాకుండా, కనీసం అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. కాగాబాధితుల తరపున న్యాయవాది సుబ్బారావు ఈ నిధులను వెనక్కి ఇవ్వాలని నిలదీయగా, మంగ్లీ టీమ్ నుంచి ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి.
అయితే, మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఊడుగుల తనకు ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించారని, తనను రోడ్డు ప్రమాదంలో చంపేస్తామని భయపెట్టారని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పంజాగుట్ట పోలీసులు BNS సెక్షన్ 351 (2), 352 కింద కేసు నమోదు చేశారు. మంగ్లీకి ఉన్న క్రేజ్ రీత్యా ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లో దర్శకుడు వేణు ఊడుగుల ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా నిధులు వసూలు చేశారా..లేక ఈ వ్యవహారం వెనుక ఇతర శక్తులు ఉన్నాయా? అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







