24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!

- April 12, 2026 , by Maagulf
24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!

మనామా: జాతీయ ఆహార సరఫరాలను పరిరక్షించడానికి మరియు నిత్యావసర వస్తువుల లభ్యతను నిర్ధారించడానికి బహ్రెయిన్ 24-గంటల ఆపరేషన్స్ రూమ్‌ను ప్రారంభించింది. ఈ మేరకు ఎంపీ హసన్ ఇబ్రహీం ప్రశ్నకు సమాధానంగా పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ అడెల్ ఫఖ్రో పార్లమెంటుకు తెలిపారు.

వాణిజ్య మార్గాలను ప్రభావితం చేస్తున్న ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా ఉన్నప్పటికీ, స్థానిక డిమాండ్‌ను తీర్చడానికి నిత్యావసర ఫుడ్ స్టాక్ సరిపోతుందని ఆయన అన్నారు.

ధరల పర్యవేక్షణ

అన్యాయమైన ధరల పెంపును నిరోధించడానికి మంత్రిత్వ శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటోంది. ధరల పెంపునకు గాను అధికారులు నాలుగు వ్యాపార సంస్థలను మూసివేశారు. ఒక కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు నివేదించగా, ఇతరులకు హెచ్చరికలు జారీ చేసి, వారి ధరలను సరిదిద్దుకోవాలని ఆదేశించారు.

నిరంతరం తనిఖీ బృందాలు మార్కెట్లు, షాప్స్, వేర్ హౌజ్ లు మరియు సఫ్లై సెంటర్లలో ప్రతిరోజూ తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా ఇన్‌వాయిస్‌లు, సఫ్లై చైన్స్ మరియు ఖర్చులను సమీక్షిస్తున్నాయి.

24/7 పర్యవేక్షణ వ్యవస్థ

లాజిస్టిక్స్‌ ను వేగవంతం చేయడానికి, కీలక సరఫరాదారుల కోసం సంధాన అధికారులతో పాటు, 24 గంటలూ పనిచేసే ఒక ఆపరేషన్స్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్థానిక ఆహార ఉత్పత్తిని బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖ ఆర్థిక అభివృద్ధి బోర్డుతో కలిసి పనిచేస్తూనే, ప్రాంతీయ సఫ్లై చైన్స్ ను సురక్షితం చేయడానికి GCC భాగస్వాములతో సహకరిస్తోందని మంత్రి ఫఖ్రో వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com