పిల్లి నేపథ్యంలో సినిమా...
- August 04, 2016
కోలీవుడ్‌లో శునకాలకు సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఏనుగు, పాముల నేపథ్యంలోనూ తీశారు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఈ వరుసలో పిల్లి కూడా ఉన్నప్పటికీ... ఒకట్రెండు సన్నివేశాలకు మాత్రమే పరిమితం చేశారు మన దర్శకులు. ఇప్పుడు పిల్లి ప్రధాన పాత్రలో తమిళంలో పూర్తిస్థాయి చిత్రం తెరకెక్కుతోంది. చిన్నాస్ పళనిస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి 'మియావ్' అని పేరు పెట్టారు. గ్లోబల్ ఉడ్స్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ.. '' ఇప్పటివరకు వందకుపైగా ప్రకటనలను రూపొందించా. చాలా కాలంగా పిల్లి నేపథ్యంలో సినిమాను తెరకెక్కించాలని అనుకున్నా. ఇప్పటికి ఆ కోరిక నెరవేరింది. మా కథ కోసం నాగపూర్ నుంచి ఓ పిల్లిని తీసుకొచ్చి నటింపజేశాం. సాధారణంగా దాన్ని అందరూ అపశకునంగా భావిస్తారు. ఈ సినిమాతో పిల్లి అంటే ఇష్టం పెరుగుతుంది. ఇందులో దానికి రెండు పాటలు కూడా ఉన్నాయి. చిత్రీకరణ 34 రోజుల్లో పూర్తి చేశాం. గ్రాఫిక్ పనులకు దాదాపు ఆరు నెలలు పట్టింది. ఇందులో పిల్లికి సెల్ఫీ అని పేరు పెట్టాం. కామెడీ అద్భుతంగా పండింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు కూడా పూర్తయ్యాయి. సెప్టెంబరులో సినిమాను తెరపైకి తీసుకొస్తామ''ని పేర్కొన్నారు. ఇటీవలే ట్రైలర్, ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







