ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- April 12, 2026
రియాద్: ఈస్ట్-వెస్ట్ (East–West) పైప్‌లైన్ ద్వారా రోజుకు సుమారు ఏడు మిలియన్ బ్యారెళ్ల (mbpd) పూర్తి పంపింగ్ సామర్థ్యాన్ని పునరుద్ధరించినట్లు సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది.దీంతో మనిఫా (Manifa) ఫీల్డ్ నుండి రోజుకు సుమారు 3,00,000 బ్యారెళ్ల మేర ప్రభావితమైన ఉత్పత్తిని తిరిగి పొందినట్లు పేర్కొంది. ఇందుకు చేపట్టిన నిర్వహణ మరియు సాంకేతికపరమైన ప్రయత్నాలు విజయవంతమయ్యాయని సౌదీ ఇంధన మంత్రిత్వ తెలిపింది. ఈ ప్రక్రియ అంతా చాలా తక్కువ సమయంలోనే పూర్తయిందని ప్రకటించింది.
ఏప్రిల్ 9న దాడుల కారణంగా ఇంధన రంగంలోని కొన్ని సదుపాయాలపై ప్రభావం పడిందని, ఇందులో ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ద్వారా రోజుకు సుమారు 7,00,000 బ్యారెళ్ల పంపింగ్ సామర్థ్యం కోల్పోయినట్లు అంతకుముందు ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో మనిఫా క్షేత్రంలో ఉత్పత్తి రోజుకు సుమారు 3,00,000 బ్యారెళ్లు తగ్గడం, అలాగే ఖురైస్ (Khurais) క్షేత్రంలో ఉత్పత్తిపై రోజుకు సుమారు 3,00,000 బ్యారెళ్ల మేర ప్రభావితం అయినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నది.
కాగా, ఖురైస్ ఫీల్డ్ కు సంబంధించి, పూర్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని పునరుద్ధరించే పనులు ఇంకా కొనసాగుతున్నాయని, ఈ పనులు పూర్తయిన వెంటనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంత్రిత్వశాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!
- సౌదీలో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు ముమ్మరం..!!
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం







