ముంబై పై బెంగళూరు ఘన విజయం

- April 13, 2026 , by Maagulf
ముంబై పై బెంగళూరు ఘన విజయం

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అదరగొట్టింది. ముంబై పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విధ్వంసం సృష్టించింది. భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. 241 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 222 పరుగులే చేసింది. దీంతో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముంబై జట్టులో బ్యాటర్ రూధర్ ఫోర్డ్ సెన్సేషనల్ బ్యాటింగ్ చేశాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. 31 బంతుల్లోనే 71 పరుగులు బాదాడు. ఏకంగా 9 సిక్సర్లు కొట్టాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ముంబైకి ఓటమిని తప్పించలేకపోయాడు. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది మూడో విజయం. ముంబై ఇండియన్స్ కి హ్యాట్రిక్ పరాజయం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com