అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- April 13, 2026
దోహా: విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో.. ఖతార్ విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ పలు మార్పులను ప్రకటించింది. ఇందులో భాగంగా అవసరమైన సర్టిఫికేట్లకు సంబంధించిన నిబంధనలను వెల్లడించడంతోపాటు కొన్ని నిర్దిష్ట వర్గాల విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేశారు.
కొత్త నిబంధనల ప్రకారం..విజిట్ వీసా (visit visa) పై ఖతార్‌కు వచ్చే విద్యార్థులకు వారి నివాస అనుమతి (residency) ప్రక్రియలను పూర్తి చేసుకోవడానికి రెండు నెలల గడువు ఇవ్వబడుతుంది. అవసరమైతే ఈ గడువును మరో రెండు నెలల పాటు పొడిగించుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
కొత్తగా వచ్చిన విద్యార్థులకు అండగా నిలిచే లక్ష్యంతో తీసుకున్న మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్దేశిత వయో పరిమితి ప్రమాణాలకు సరిపోని విద్యార్థులు కూడా, పాఠశాల నిర్వహించే ప్రవేశ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులైతే, వారి ఇటీవలి విద్యా సర్టిఫికేట్ల ఆధారంగా అడ్మిషన్లను కల్పిస్తారు. వీటితోపాటు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ధృవపత్రాల ధ్రువీకరణ (attestation) లేకుండా వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు, ఆ ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి రెండు నెలల అదనపు గడువు (grace period) ఇవ్వబడుతుంది.ఖతార్ లో దివ్యాంగులు మరియు అభ్యాస వైకల్యాలు (learning difficulties) కలిగిన విద్యార్థుల ప్రవేశానికి అనుమతించదగిన గరిష్ట వయో పరిమితిని కూడా మంత్రిత్వ శాఖ పెంచింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







