ఎమ్ఐ-17 హెలికాప్టర్ అఫ్గానిస్థాన్‌లో ల్యాండవుతూ కూలి పోయింది
- August 05, 2016
పాకిస్థాన్‌కి చెందిన ఎమ్ఐ-17 హెలికాప్టర్ అఫ్గానిస్థాన్‌లో ల్యాండవుతూ కూలి పోయింది. రష్యాలో తయారైన ఈ హెలికాప్టర్‌ను పంజాబ్ ప్రావిన్షియల్ ప్రభుత్వానికి చెందినది. రొటీన్ సర్వీసులు నిమిత్తం హెలికాప్టర్ రష్యాకి వెళుతుండగాసాంకేతిక లోపంతో అఫ్గానిస్థాన్‌లోని లోగర్ ప్రావిన్స్‌లోని అజ్రా జిల్లాలో ల్యాండ్ అవబోతుండగా కూలిపోయింది. ఇది ముష్కరుల పనేనని, హెలికాప్టర్లో ఉన్న ఏడుగురు సిబ్బందిని తాలిబన్ ఉగ్రవాదులు తమ ఆదీనంలోకి తీసుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అఫ్గాన్‌లో కూలిపోయింది తమ హెలికాప్టరేనని కానీ అక్కడి ప్రభుత్వం అధికారికంగా ఏ వివరాలు వెల్లడించలేదని పంజాబ్ ప్రభుత్వాధికారులు తెలిపారు. హెలికాప్టర్లో ఉన్న ఏడుగురి ఆచూకీ కూడా తెలియరాలేదని అందులో రష్యాకి చెందిన ఇంజినీర్, ఆరుగురు పాకిస్థానీలు ఉన్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







