బహ్రెయిన్ పోస్ట్ నుంచి రెండు కొత్త స్టాంపులు
- August 05, 2016
మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ మరియు టెలికమ్యూనికేషన్స్ (ఎంటిటి) బహ్రెయిన్ పోస్ట్ రెండు కొత్త స్టాంపులను అరబ్ పోస్టల్ డే సందర్భంగా విడుదల చేసింది. అరబ్ దేశాలతో కలిసి పోస్టల్ సెక్టార్‌లో గణనీయమైన అభివృద్ధికి ఆస్కారం ఉందని ఈ సందర్భంగా బహ్రెయిన్ పోస్ట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. బహ్రెయిన్ పోస్ట్, మినిస్ట్రీకి చెందిన అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ షేక్ బాదర్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా మాట్లాడుతూ, బహ్రెయిన్ కింగ్‌డమ్ తాలూకు చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు బహ్రెయిన్ పోస్ట్ తనవంతుగా కృషి చేస్తుందనీ, అలాగే ముఖ్యమైన ఈవెంట్స్‌కి మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ఇలాంటి వేదికల్ని వినియోగించుకుంటామని అన్నారు. బహ్రెయిన్ పోస్ట్, కమ్యూనికేషన్ విభాగంలో ముఖ్య భూమిక పోషిస్తోందని ఆయన అన్నారు. 200 మరియు 300 ఫిల్స్ , 30 మరియు 40 సైజులో స్టాంప్స్ అందుబాటులో ఉంటాయనీ, షీట్ 750 ఫిల్స్‌కి లభ్యమవుతుందనీ, ఇవన్నీ బహ్రెయిన్ పోస్ట్ బ్రాంచ్‌లలో పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







