మే 1 నుంచి టీటీడీలో కొత్త రూల్స్..!
- April 14, 2026
తిరుమల: వేసవి సెలవుల దృష్ట్యా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మే 1వ తేదీ నుంచి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
వేసవిలో రికార్డు స్థాయిలో వచ్చే భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మే 1వ తేదీ నుంచి వీఐపీ (VIP) బ్రేక్ దర్శనాలను మరియు స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లను పూర్తిగా రద్దు చేయాలని భావిస్తున్నారు. సాధారణంగా వీఐపీ దర్శనాల కోసం ప్రతిరోజూ కేటాయించే 2 నుండి 3 గంటల సమయంలో కేవలం 3,800 మంది మాత్రమే దర్శనం చేసుకుంటున్నారు. అదే సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయిస్తే ఏకంగా 15,000 మందికి స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందని అధికారులు లెక్కగట్టారు. దీనివల్ల సామాన్యులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది.
గత మూడు ఏళ్ల వేసవి గణాంకాలను పరిశీలిస్తే, మే నుండి జూలై వరకు ప్రతి నెలా సగటున 24 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఈ రద్దీని తట్టుకోవడానికి గత ఏడాది వైకుంఠ ఏకాదశి సమయంలో అమలు చేసిన సక్సెస్ ఫుల్ మోడల్‌ను ఈ వేసవిలోనూ అమలు చేయాలని టీటీడీ యోచిస్తోంది. ప్రస్తుతం ఎస్‌ఎస్‌డీ టోకెన్లు ఉన్నవారు కూడా దర్శనం కోసం దాదాపు 23 గంటలు వేచి చూడాల్సి వస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం దర్శన కేటగిరీలను క్రమబద్ధీకరిస్తే, సామాన్య భక్తులు కేవలం 8 నుండి 12 గంటల్లోనే దర్శనం పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
టీటీడీ ప్రణాళిక ప్రకారం వీఐపీ కోటాను తగ్గించడం వల్ల ప్రతిరోజూ సగటున 80,000 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించవచ్చని అంచనా. రద్దీ పెరిగే కొద్దీ సామాన్య భక్తులకు కేటాయించే సమయాన్ని పెంచడం ద్వారా ఎండల తీవ్రత నుంచి వారికి ఉపశమనం కలిగించవచ్చని బోర్డు భావిస్తోంది. త్వరలోనే దీనిపై టీటీడీ అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ మార్పుల ద్వారా సిఫార్సు లేఖలపై వచ్చే వీఐపీల సంఖ్య తగ్గి, సామాన్య భక్తుల దర్శనం వేగవంతం కానుంది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







