అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం
- April 14, 2026
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం
అమరావతి: ఏపీలో క్వాంటం నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. అమరావతిలో క్వాంటం ఫెసిలిటీస్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. భారత్ లో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ఆయన ప్రారంభించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ సహా మేధా టవర్స్ లోని 1క్యూ క్వాంటం ఫెసిలిటీని చంద్రబాబు ప్రారంభించారు. ఈ రెండు క్వాంటం టెస్ట్ బెడ్స్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించేలాగా సదుపాయం చేశారు. ఈ రెండు కంప్యూటర్ల ఆవిష్కరణతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. మైనస్ 273 డిగ్రీల సెంటిగ్రేడ్ అతి శీతల ఉష్ణోగ్రతలో పని చేసే ఈ మినీ క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్లు క్వాంటం ఉపకరణాల తయారీ, పరిశోధనలలో కీలకం కానున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







