తామరగింజల్తో నిత్య యవ్వనం
- July 23, 2015
తామరపువ్వును దేవతా పుష్పంగా మన దేశంలో ప్రజలు బాగా ఆదరిస్తారు. అయితే ఈ తామరపువ్వునే కాదు తామరపువ్వులోని గింజల్లో అనేక రకాల పోషకాలు, ప్రోటీన్లు చాలా అధికం. ఈ గింజలనే మార్కెట్లో ఫూల్ మఖానీగా విక్రయిస్తున్నారు. దీనికి తేలిగ్గా జీర్ణమయ్యే లక్షణం ఉండడం వల్ల ఏ వయసువారైనా తినొచ్చు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, హృద్రోగాలు, కాన్సర్ వంటి వాటికి దారి తీసే ప్రీ రాడికల్స్‌ను నిరోధిస్తాయి. దీనిలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు వయసుని మీద పడనీయవు. ముఖ్యంగా ఇందులో ఎల్ ఐసొయాస్పర్టిల్ మిథైల్ ట్రాన్స్‌ఫెరేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది దెబ్బ తిన్న ప్రొటీన్లను బాగు చేస్తుంది. అందుకే ఈ గింజలను ముఖ్యంగా ఏంటీ ఏజింగ్ క్రీముల్లోనూ, మందుల్లోనూ వాడుతున్నారు. అంతే కాదు గర్భిణులు, బాలింతలకూ ఇవి ఆహారంతో పాటు కలిపి ఇవ్వడం వల్ల నీరసం లేకుండా ఉంటుంది. నిద్రలేమి, చికాకులతో బాధపడేవాళ్లు వీటిని తమ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలోని పీచు పదార్ధం మలబద్దకం ఉన్నవారికి మంచి ఔషధంగా పని చేస్తుంది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







