IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- April 14, 2026
చెన్నై: చెన్నైలో కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. కోల్ కతాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్ కే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 193 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ ను చెన్నై బౌలర్లు కట్టడి చేశారు. దీంతో కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 32 పరుగుల తేడాతో చెన్నై విక్టరీ కొట్టింది. ఈ సీజన్ లో చెన్నైకి ఇది వరుసగా రెండో విజయం. మరోవైపు కోల్ కతా తీరు మారలేదు. వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. ఈ సీజన్ లో కేకేఆర్ కు ఇది నాలుగో ఓటమి. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడిన కేకేఆర్.. ఒక్క విజయం కూడా సాధించలేదు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







